నేటి నుంచి అప్రంటీస్‌షిప్‌పై అవగాహన

ABN , First Publish Date - 2023-02-07T23:40:53+05:30 IST

ఐటీఐ అభ్యర్థులకు అప్రంటీస్‌షిప్‌తో కలిగే ప్రయోజనాలపై బుధవారం నుంచి రెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చనున్నట్లు రీజనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ పెన్యూర్‌షిప్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పి.చంద్రమౌళి, ఐటీఐ అడ్మిషన్ల జిల్లా కన్వీనర్‌ కేఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

నేటి నుంచి అప్రంటీస్‌షిప్‌పై అవగాహన

ఎచ్చెర్ల: ఐటీఐ అభ్యర్థులకు అప్రంటీస్‌షిప్‌తో కలిగే ప్రయోజనాలపై బుధవారం నుంచి రెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చనున్నట్లు రీజనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ పెన్యూర్‌షిప్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పి.చంద్రమౌళి, ఐటీఐ అడ్మిషన్ల జిల్లా కన్వీనర్‌ కేఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో మంగళవారం వారు మా ట్లాడుతూ.. బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో పరిశ్రమలు, ఒకేషనల్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రతినిధులు, అప్రంటీస్‌షిప్‌ సలహా దారులతో, గురువారం ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో విద్యార్థులకు అప్రంటీస్‌షిప్‌ ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏడీ కె.శ్రీకాంత్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T23:40:54+05:30 IST