బాబోయ్ కోతులు..
ABN , First Publish Date - 2023-11-01T00:31:56+05:30 IST
మున్సిపాల్టీలో కోతుల సంచారం రోజురోజుకు పెరిగిపోతుంది. బయటకు రావటానికి ప్రజలు భయపడుతు న్నారు.
ఇచ్ఛాపురం: మున్సిపాల్టీలో కోతుల సంచారం రోజురోజుకు పెరిగిపోతుంది. బయటకు రావటానికి ప్రజలు భయపడుతు న్నారు. మంగళవారం రాత్రి బస్టాండ్ నుంచి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వరకు వందలాది కోతులు ఒకేసారి రావడంతో ట్యూషన్స్ నుంచి వచ్చే విద్యార్థులు, పెద్దలు, వృద్ధులు కూడా ఇబ్బందులు పడ్డారు. కోతులు ఒక్కసారిగా రావడంతో పిల్లలు పరుగులు తీశారు. సుమారు గంట పాటు కోర్టు బయటే కోతులు ఉండిపోవడంతో ప్రజలు అటుగా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మున్సిపల్ అధికారులు స్పందించి కోతులను అరికట్టాలని సర్వత్రా కోరుతున్నారు.