జీడిపై చిగురిస్తున్న ఆశ
ABN , First Publish Date - 2023-02-24T23:34:48+05:30 IST
జీడి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018 తితలీ తుఫాన్ దెబ్బకు జీడి మొక్కలు పూర్తిస్థాయిలో దెబ్బతిని కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఇటు వ్యాపారులు, అటు రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జీడిపూత ఆశించిన స్థాయి కంటే బాగా పూయడం, పిక్కలు కూడా గుత్తులుగా కాయంతో ఆయా వర్గాల్లో ఆశ చిగురిస్తోంది. ఎటు వంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉంటే ఈ ఏడాది పంట బాగానే ఉంటుందని రైతులు పేర్కొంటుండగా ఇలాగే కొనసాగితే విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి జీడి పిక్కల దిగుమతి అవసరం ఉండదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
ఇలాగే ఉంటే ఈ ఏడాది దిగుమతి అవసరం ఉండదు
(పలాస)
జీడి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018 తితలీ తుఫాన్ దెబ్బకు జీడి మొక్కలు పూర్తిస్థాయిలో దెబ్బతిని కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఇటు వ్యాపారులు, అటు రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జీడిపూత ఆశించిన స్థాయి కంటే బాగా పూయడం, పిక్కలు కూడా గుత్తులుగా కాయంతో ఆయా వర్గాల్లో ఆశ చిగురిస్తోంది. ఎటు వంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉంటే ఈ ఏడాది పంట బాగానే ఉంటుందని రైతులు పేర్కొంటుండగా ఇలాగే కొనసాగితే విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి జీడి పిక్కల దిగుమతి అవసరం ఉండదని వ్యాపారులు పేర్కొంటున్నారు. వరి పంట బాగా పండిన సంవత్సరంలో అదే ఏడాది జీడి కూడా పండుతుందని రైతుల నమ్మకం. వారి నమ్మకం వమ్ముకాకుండా ప్రస్తుతం జీడి పిక్కలు గుత్తులు కనిపిస్తు న్నాయి. ఈ ప్రాంతంలో సరాసరి ఎకరాకు నాలుగు నుంచి ఆరు బస్తాల వరకు పండు తాయి. ఒక్కో బస్తాకి 80 కిలోల పిక్కలు వస్తాయి. తితలీ తరు వాత ఆ స్థాయిలో కలిసిరాలేదు. తితలీ తరువాత జీడి పంటంతా కొట్టు కుపోయింది. మరలా గడచిన రెండేళ్ల నుంచి జీడి చిగురించి ఈ ఏడాది పంట బాగాను పండుతోందని పలువురు రైతులు, వ్యాపారులు పేర్కొం టున్నారు. ఈ ఏడాది అనుకున్నదాని కన్నా అదనంగా పిక్కల దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతు న్నారు. జిల్లాలో మొత్తం 34వేల హెక్టార్లలో జీడి పంట సాగవు తోంది. ఉద్దానం ఎర్రనేలలు జీడికి అనుకూలంగా ఉండడంతో రైతులు ఈ పంటనే జీవనాధారంగా చేసుకుని ఆదాయం పొందు తున్నారు. ప్రతి ఏటా జిల్లాలో పండే పంట చాలకపోవడంతో వ్యాపారులు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి జీడి పిక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న జీడి పరిశ్రమలకు ఇక్కడ పండే పంట కేవలం 20 శాతం మాత్రమే ముడి సరకు అందిస్తుంది. మిగిలిన 80 శాతం పిక్కలు వేర్వేరు మార్గాల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం దిగుబడి పెరగడంతో విదేశాలపై ఆధార పడకుండా మన పిక్కలు మన అవసరాలకు సరిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన జీడి వ్యాపారులు కూడా ఇప్పటి నుంచే పిక్కల కొనుగోలుకు అడ్వాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలలు వాతా వరణం ఇదేవిధంగా కొనసాగితే పూర్తిస్థాయి జీడి పంట చేతికి వచ్చే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కారణంగా పూత దశలోనే మాడిపోతోందని ఉద్యానవనశాఖ అధి కారులు గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడితే ఫలితం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది మన అవసరాలకు సరిపోతుంది
ఉద్దానం ప్రాంతంలో ఈ ఏడాది పంట అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో ఈ పంట ఈ ప్రాంత వ్యాపార అవసరాలకు సరిపోతుందని భావిస్తున్నాం. అయితే పరిశ్రమల సంఖ్య పెరుగు తుండడంతో జీడి పిక్కలు పూర్తిస్థాయిలో దొరక డం లేదు. కొత్త పంటలు వేసి అధిక దిగుబడి సాధించేందుకు తాము సాంకేతికంగా రైతులకు సాయం అందిస్తాం.
-మల్లా సురేష్‌కుమార్, జీడి వ్యాపార సంఘ అధ్యక్షుడు