నౌపడలో ఈదురుగాలుల బీభత్సం

ABN , First Publish Date - 2023-06-09T23:22:21+05:30 IST

నౌపడలో శుక్రవారం మధ్యాహ్నం ఈదు రుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆకస్మాత్తుగా వచ్చిన గాలు లకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. రేకుల షెడ్లు ఎగిరిపో యాయి. సుమారు 15 నిమిషాల పాటు వడగళ్ల వాన కురి సింది. ఈదురుగాలులకు గ్రామానికి చెందిన గుజ్జు బుల్లమ్మ రేకుల షెడ్‌ కూలిపోయి నిరాశ్రరాలైంది.

నౌపడలో ఈదురుగాలుల బీభత్సం
కూలిన షెడ్‌ వద్ద రోదిస్తున్న గుజ్జు బుల్లమ్మ

సంతబొమ్మాళి: నౌపడలో శుక్రవారం మధ్యాహ్నం ఈదు రుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆకస్మాత్తుగా వచ్చిన గాలు లకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. రేకుల షెడ్లు ఎగిరిపో యాయి. సుమారు 15 నిమిషాల పాటు వడగళ్ల వాన కురి సింది. ఈదురుగాలులకు గ్రామానికి చెందిన గుజ్జు బుల్లమ్మ రేకుల షెడ్‌ కూలిపోయి నిరాశ్రరాలైంది. పలికల రాజేశ్వరికి చెందిన వంట గదిపై తాటి చెట్టు పడిపో వడంతో వంట గది నేలమట్టమైంది. ఎల్లూరు సురేష్‌కు చెందిన రేకులషెడ్‌ గాలికి ఎగిరిపోయింది. సాయం త్రం వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. నౌపడతో పాటు బోరుభద్ర, మలగాం ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండి ఉక్కపోతకు గురైన ప్రజలు ఈదురుగాలుల వర్షం కురవడంతో భయాందో ళన చెందారు.

Updated Date - 2023-06-09T23:22:21+05:30 IST