జీపీఎస్‌ను అంగీకరించేది లేదు

ABN , First Publish Date - 2023-02-18T00:03:38+05:30 IST

గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌(జీపీఎస్‌)ను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నాయకులు స్పష్టం చేశారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా శాఖ చైర్మన్‌ కె.శ్రీరాములు, అసోసియేట్‌ చైర్మన్‌ లక్ష్మణ రావు, ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వే ణుగోపాలరావు మాట్లాడారు.

జీపీఎస్‌ను అంగీకరించేది లేదు
మాట్లాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ప్రతినిధులు

- సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..

పాత పింఛన్‌ను పునరుద్ధరించాల్సిందే

- ఏపీ జేఏసీ జిల్లా నాయకుల డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌(జీపీఎస్‌)ను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నాయకులు స్పష్టం చేశారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా శాఖ చైర్మన్‌ కె.శ్రీరాములు, అసోసియేట్‌ చైర్మన్‌ లక్ష్మణ రావు, ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వే ణుగోపాలరావు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మరో ప్రత్నామ్నాయం వద్దని పాత పిం ఛన్‌ను పునరుద్ధరించాల్సిందేనని పట్టుబట్టారు. ఉద్యోగులు సొంత అవసరాల కోసం దాచుకున్న డబ్బులను కూడా అవసరానికి ప్రభుత్వం చెల్లించడంలేదని ఆవే దన వ్యక్తం చేశారు. దీంతో పిల్లల పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాల్సి వస్తుందని వాపోయా రు. వైద్యం చేయించుకోవడానికి కూడా తమ వద్ద డబ్బులు ఉండడం లేదన్నారు. ఇం తవరకు 11వ పీఆర్సీలో పొందుపరిచిన క్యాడర్‌ స్కేల్స్‌ను సంబంధిత శాఖాధికారు లకు ఇంకా పంపలేదని, దీన్నిబట్టే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అర్థమవుతుందన్నారు. కనీసం ఉద్యోగుల నెలవారీ జీతాలు, పెన్షన్లు ప్రతినెలా ఒకటో తేదీన వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఉద్యోగు లకు విలీనానికి ముందున్న సర్వీస్‌ రూల్స్‌, మెడికల్‌ సౌకర్యాలను యథాతథంగా అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం జేఏసీ పోరాడుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బీవీవీఎన్‌ రాజు, కోశాఽధికారి శ్రీనివాసరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

గారలో నిరసన

గార:సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్‌ మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. 12వ వేతన సంఘాన్ని నియమించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇవ్వాలని, పీఎఫ్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ ఎస్‌.ఎస్‌.సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వి.నవీన్‌కుమార్‌, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిట్టి త్రినాధరావు, వాసుపల్లి రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-18T00:03:40+05:30 IST