మెడికల్‌ కళాశాలకు మృతదేహం దానం

ABN , First Publish Date - 2023-05-29T00:27:14+05:30 IST

మెడికల్‌ కళాశాలకు ఓ వృద్ధురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు దానం చేశారు.

మెడికల్‌ కళాశాలకు మృతదేహం దానం
జానకమ్మ మృతదేహం వద్ద డీఈవో తిరుమల చైతన్య

శ్రీకాకుళం, మే 28 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌ కళాశాలకు ఓ వృద్ధురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకు ళం జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య ప్రవృ త్తిగా ప్యాక్ట్‌ (పుష్పాంజలి అవే కింగ్‌ అండ్‌ చారిటబు ల్‌ ట్రస్ట్‌) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డీఈవోతోపాటు ఆయన కుటుంబ సభ్యులు మరణాంతరం వైద్యకళాశా లకు దేహాలను అప్పగించేం దుకు ఒప్పందపత్రాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఇప్పటికి నలుగురి మృతదేహాలను సంస్థ ద్వారా వైద్య కళాశాలకు అప్పగించారు. శ్రీకాకుళం నగరంలో ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద అమ్మవా రి ఆలయం సమీపంలో నివసిస్తున్న అల్లూరి జానకమ్మ (86) పదిహేనేళ్ల కింద టే మరణానంతరం తన దేహాన్ని అప్పగిస్తు న్నట్టు అంగీకార పత్రాన్ని అందించా రు. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె మరణించింది. దీంతో కుటుం బ సభ్యులు జానకమ్మ మృతదేహాన్ని ట్రస్టు చైర్మన్‌ తిరుమల చైతన్య, జెమ్స్‌ ఆసుపత్రి సహకారంతో వైద్యకళాశాలకు అందించారు.

Updated Date - 2023-05-29T00:27:56+05:30 IST