అచ్చెన్నను విమర్శించే అర్హత ‘దువ్వాడ’కు లేదు

ABN , First Publish Date - 2023-01-30T00:03:12+05:30 IST

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజ రాపు అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి రావు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయడుపై దువ్వాడ చేసి న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అచ్చెన్నను విమర్శించే అర్హత ‘దువ్వాడ’కు లేదు
ఎస్‌ఐ రామకృష్ణకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

ఎమ్మెల్సీ శ్రీనివాస్‌పై టీడీపీ నేతల ఆగ్రహం

టెక్కలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజ రాపు అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి రావు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయడుపై దువ్వాడ చేసి న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టెక్కలి నియోజకవర్గ ప్రజలు అధికార వైసీపీ నేతల వైఖరిని అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో ఓటమి తప్ప గెలుపెరగని దువ్వాడ... అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. దువ్వాడ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వారు ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ దువ్వాడపై పోలీసులకు ఫిర్యాదు

టెక్కలి రూరల్‌: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అసభ్య పదజాలంతో దూషించి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి టీడీపీ మండల నాయకులు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. వ్యక్తిగత దూషణలు, రాయలేని భాషలో తిట్టడం, బెదిరింపులకు పాల్పడ్డారని, తక్షణం ఎమ్మెల్సీ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కాకపార్టీ నందిగాం మండల అధ్యక్షుడు పినకాన అజయ్‌ కుమార్‌, నేతలు హనుమంతు రామకృష్ణ, మట్ట పురుషోత్తం, చాపర గణపతి, మెండ దమ యంతి, మామిడి రాము, దల్లి ప్రసాద్‌ రెడ్డి, కోళ్ల కామేష్‌, రెయ్యి ప్రీతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-30T00:03:34+05:30 IST