ఉత్సాహంగా స్పోర్ట్స్ మీట్
ABN , First Publish Date - 2023-01-05T23:44:45+05:30 IST
శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం రీజనల్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. మూడు రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్‌ను స్థానిక శాసనసభ్యుడు గొర్లె కిరణ్‌కుమార్ ప్రారంభించారు.
ఎచ్చెర్ల, జనవరి 5: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం రీజనల్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. మూడు రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్‌ను స్థానిక శాసనసభ్యుడు గొర్లె కిరణ్‌కుమార్ ప్రారంభించారు. 10 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 435 మంది పాల్గొన్నారు. ఇందులో బాలురు 264, బాలికలు 171 మంది ఉన్నారు. ఆరు గేమ్స్, 13 స్పోర్ట్స్ విభాగాల్లో వీరు తలపడుతు న్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జి.దామోదరరావు, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.ఆదిలక్ష్మి, రణస్థలం జడ్పీటీసీ టొంపల సీతారాం, స్థానిక వైసీపీ నేత పైడి వెంకన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు.
క్రీడా పోటీల పరిశీలకుడిగా భాస్కర్
జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ అంతర వర్సిటీ ఖోఖో పోటీల పరిశీలకునిగా అంబేడ్కర్ యూనివర్సిటీ పీడీ ఎ.భాస్కర్ నియమితులయ్యారు. ఈ ఎంపిక పత్రాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు గురువారం పీడీ భాస్కర్‌కు అందజేశారు.
కబడ్డీ పోటీలు ప్రారంభం
రణస్థలం: మండల కేంద్రంలో గురువారం నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను నిఖిల విద్య, వైద్య చారిటుబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.
ముగిసిన ప్రో కబడ్డీ పోటీలు
పాతపట్నం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రో కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. ప్రదీప్ యువసేన, సింహ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. గురువారం గుంటూరు, నిజాంపేటల మధ్య ఫైనల్ జరగ్గా గుంటూరు విజేతగా నిలిచింది. విజేతలకు అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ప్రదీప్ నర్వాల్ బహుమతులు అందించారు. వైస్ ఎంపీపీ సవిరిగాన ప్రదీప్, ఏఎంసీ అధ్యక్షుడు కొండాల అర్జునుడు, నూలు ఈశ్వ రరావు, గిరిజన నాయకులు గురాడి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
లాబర గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్
లాబర గ్రామంలో ధర్మాన శ్రీను మెమోరియల్ డివిజనల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఈనెల 16వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొంటున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డా.కె.చక్రపతి తెలిపారు. ఎంపీపీ దొర సావిత్రమ్మ, స ర్పంచ్ గార కాంతారావు, దొర పార్వతీశం, రాము, జె.సురేష్ పాల్గొన్నారు.
111111111111111111