టెక్కలి ఆస్పత్రిలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2023-09-10T00:45:58+05:30 IST

టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలోని ఇన్‌పేషంట్‌ వార్డుల్లో శుక్ర వారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ వ్యక్తి చోరీకి విఫలయత్నం చేశా డు.

టెక్కలి ఆస్పత్రిలో చోరీకి విఫలయత్నం

టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 9: టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలోని ఇన్‌పేషంట్‌ వార్డుల్లో శుక్ర వారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ వ్యక్తి చోరీకి విఫలయత్నం చేశా డు. ఎంఎస్‌, ఎంఎంఐడీ వార్డుల్లోకి ఓ వ్యక్తి ప్రవేశించి పలువురు మహిళల మెడల్లోని బంగారం గొలుసులు, కాళ్ల పట్టీలను తీసేందుకు ప్రయత్నం చేయడంతో రోగులు గమనించి కేకలు వేశారు. దీంతో అతను పరారయ్యాడు. ఈ వ్యక్తి స్థానికుడేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతను ఇటీవల ఆర్థోకు సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.సూర్యారావు తెలిపారు.

Updated Date - 2023-09-10T00:45:58+05:30 IST