మే 2, 3 తేదీల్లో నిరవధిక నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2023-04-27T00:24:15+05:30 IST
బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ మే 2, 3 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి తెలిపారు. ఈ మేరకు స్థానిక వైటీసీ భవనంలో బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు.
పాతపట్నం: బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ మే 2, 3 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి తెలిపారు. ఈ మేరకు స్థానిక వైటీసీ భవనంలో బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నిజమైన ఆదివాసీలు నష్టపోతున్నా రన్నారు. నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరారు. ఆజారి రామారావు, మల్లిపురం శ్రీను పాల్గొన్నారు.