ప్రజల మేలు కోరేది తెలుగుదేశం పార్టీయే
ABN , First Publish Date - 2023-06-26T23:35:12+05:30 IST
ప్రజల మేలు కోరేది టీడీపీయేనని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం మునిసిపాలిటీ రెండో వార్డు కోసంగిపురం గ్రామంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాధించింది ఏమైనా ఉందా అని ప్రశ్నిం చారు.
పలాస, జూన్ 26: ప్రజల మేలు కోరేది టీడీపీయేనని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం మునిసిపాలిటీ రెండో వార్డు కోసంగిపురం గ్రామంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాధించింది ఏమైనా ఉందా అని ప్రశ్నిం చారు. టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్తుకు గ్యారెంటీలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, సీని యర్ కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణ, పార్టీ పట్టణ అధ్య క్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్, అంబటి కృష్ణ మూర్తి, మల్లా శ్రీనివాస్, సత్యం, అత్మారావు, బి.ఉమాకాంత్, గోళ్ల చంద్రరావు, నాబిలి శ్రీను పాల్గొన్నారు.