Share News

జగన్‌ పాదయాత్ర హామీలు గాలికి..

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:55 PM

సీఎం జగన్‌ ఎన్నిక లకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, మోసం, అబద్ధాలు, మాయ మాటలతో పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సవరడ్డపనస టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ‘నవరత్నాలు’ పేరుతో 730 హామీలిచ్చి నాలుగున్నరేళ్లలో కేవలం 109 హామీలను మాత్రమే నెరవేర్చారన్నారు.

జగన్‌ పాదయాత్ర హామీలు గాలికి..
బ్రోచర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు (సారవకోట), డిసెంబరు 30: సీఎం జగన్‌ ఎన్నిక లకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, మోసం, అబద్ధాలు, మాయ మాటలతో పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సవరడ్డపనస టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ‘నవరత్నాలు’ పేరుతో 730 హామీలిచ్చి నాలుగున్నరేళ్లలో కేవలం 109 హామీలను మాత్రమే నెరవేర్చారన్నారు. మిగిలిన హామీలను గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారని విమర్శిం చారు. సారవకోట మండలం రంగసాగరాన్ని రిజర్వాయర్‌గా తీర్చిదిద్ది రైతు లకు సాగునీరందించేందుకు టీడీపీ అధినేత, నాటి సీఎం చంద్రబాబునాయుడు రూ.50 కోట్లు మంజూరుచేసి 50 శాతం పనులు పూర్తి చేసిందని, అలాగే బొంతు ఎత్తిపోతల పథకానికి రూ.180 కోట్లు మంజూరుచేసి టెండర్లు పిలిచి శరవేగంతో పనులు సాగుతున్న సమయంలో ప్రభుత్వం మారి వైసీపీ అధి కారంలోకి వచ్చిన తరువాత వీటిని పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ద్వారా చంద్ర బాబును మళ్లీ సీఎంగా చేయాలని కోరారు. అంతకు ముందు జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 15 శాతం మాత్రమే అమలు చేసారని బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర బీసీ కమిటీ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, పిళ్లా నందకిశోర్‌, బగ్గు గోవిందరావు, బైరి భాస్కరరావు, తాడేల భీమారావు, పట్ట ఉమారావు, జయరాం పాల్గొన్నారు.
వైసీపీ హామీల్లో 85 శాతం అమలు కాలేదు: కలమట
హిరమండలం:
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు అమలు కాలేదని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ విమ ర్శించారు. శనివారం ఎల్‌ఎన్‌పేటలో ‘నవరత్నాలు-నవమోసాలు’ కరపత్రం, జగన్‌ ఇచ్చి న హామీుల్లో 85 శాతం ఫెయిల్‌ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. సీఎం జగన్‌ 99.5 శాతం హామీలను అమలు చేశామంటూ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశా రన్నారు. వంశధార-నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేస్తామని ప్రక టించినా ఆ పనులు కాలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెండ మోహన్‌, నేతలు ఉమ్మి ఆనందరావు, శివ్వాల కిషోర్‌బాబు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
‘హామీల అమలులో జగన్‌ ఫెయిల్‌’
టెక్కలి:
సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 85 శాతం అమలు చేయక ఫెయిలయ్యారని టీడీపీ నేతలు అన్నారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో జగన్‌ హామీలు 85శాతం ఫెయిల్‌ కరపత్రాలను ప్రదర్శిం చారు. ముఖ్యమంత్రి జగన్‌ 99.5శాతం హామీలు అమలు చేశామని అబ ద్ధాలు చెబుతున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారని, ఉద్యోగాల భర్తీ, అంగన్‌వాడీల సమస్యలు, మద్యపాన నిషేధం, సీపీఎస్‌ రద్దు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో టీడీ పీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, నాయకులు హనుమంతు రామ కృష్ణ, మామిడి రాము, కోళ్ల లవకుమార్‌, పోలాకి షన్ముఖరావు, రెయ్యి ప్రీతీష్‌ చంద్‌, దల్లి ప్రసాద్‌రెడ్డి, ప్రఫుల్లా పొరిడా, పంగ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:55 PM