నేటి నుంచి కరవంజలో ఆలయ వార్షికోత్సవం
ABN , First Publish Date - 2023-01-14T00:22:35+05:30 IST
కరవంజలో వెలిసిన కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం నుండి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ జుత్తు నేతాజీ, మాజీ సర్పంచ్ జుత్తు అప్పలనాయుడు తెలిపారు. శనివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు చేసి తిరువీధి నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు.
జలుమూరు, జనవరి 13: కరవంజలో వెలిసిన కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం నుండి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ జుత్తు నేతాజీ, మాజీ సర్పంచ్ జుత్తు అప్పలనాయుడు తెలిపారు. శనివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు చేసి తిరువీధి నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు. బిందెల డాన్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు, జాతర సంద ర్భంగా రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు నిర్వహిస్తున్నట్లుతెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు.
ఒకటి నుంచి జాతర
చిన్నదూగాం కూడలిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి ఒకటి నుంచి జాతర నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆలయం లో ఇన్‌చార్జి ఈవో వీవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణపై చర్చించారు. ప్రతిఏటా సంప్రదాయంగా నిర్వహిస్తున్న ఈ జాతరను ఫిబ్రవరి ఒకటి భీష్మ ఏకాదశి నుంచి 5వ తేదీ వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. జాతర సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.