నేటి నుంచిసిరిమానోత్సవాలు

ABN , First Publish Date - 2023-04-15T23:51:35+05:30 IST

ప్రియాగ్రహారంలో భువనేశ్వరీదేవి సిరిమా నోత్సవాలు ఆదివారం నుంచి ఈనెల 26 వరకు నిర్వహిం చనున్నట్లు సర్పంచ్‌ బెవరనూకరాజు, ఎంపీటీసీ ప్రసాద రావు, మాజీ సర్పంచ్‌లు లావేటి కృష్ణ, మడ్డుఅప్పయ్య తెలిపారు. ఈనెల 25న సిరిమానును ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు. సిరిమానుకోసం వేప కర్రను మానుగా విని యోగించేందుకు వీలుగా గ్రామపెద్దలు శుక్రవారం వెళ్లి బొట్టుపెట్టినట్టు తెలిపారు. సంబరాలు పురస్కరించుకొని పనులు, ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లిన వారు సాయం త్రానికి ఇంటికి చేరుకోవాలని,ఇతర గ్రామాల నుంచి సంబ రాలు జరిగే గ్రామంలో అడుగుపెట్టే వారు రాత్రికి నివసిం చరాదని, మంచాలపై నిద్రించరాదని, గ్రామంలో చెప్పులతో నడవరాదని పెద్దలు కోరారు.గుప్పెడుపేటలో కూడా ఆది వారం నుంచి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించ నున్నారు.

నేటి నుంచిసిరిమానోత్సవాలు
పోలాకి: సిరిమాను కోసం వేపకర్రను తీసుకువస్తున్న ప్రియాగ్రహారం యువకులు

పోలాకి: ప్రియాగ్రహారంలో భువనేశ్వరీదేవి సిరిమా నోత్సవాలు ఆదివారం నుంచి ఈనెల 26 వరకు నిర్వహిం చనున్నట్లు సర్పంచ్‌ బెవరనూకరాజు, ఎంపీటీసీ ప్రసాద రావు, మాజీ సర్పంచ్‌లు లావేటి కృష్ణ, మడ్డుఅప్పయ్య తెలిపారు. ఈనెల 25న సిరిమానును ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు. సిరిమానుకోసం వేప కర్రను మానుగా విని యోగించేందుకు వీలుగా గ్రామపెద్దలు శుక్రవారం వెళ్లి బొట్టుపెట్టినట్టు తెలిపారు. సంబరాలు పురస్కరించుకొని పనులు, ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లిన వారు సాయం త్రానికి ఇంటికి చేరుకోవాలని,ఇతర గ్రామాల నుంచి సంబ రాలు జరిగే గ్రామంలో అడుగుపెట్టే వారు రాత్రికి నివసిం చరాదని, మంచాలపై నిద్రించరాదని, గ్రామంలో చెప్పులతో నడవరాదని పెద్దలు కోరారు.గుప్పెడుపేటలో కూడా ఆది వారం నుంచి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించ నున్నారు.

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం

నరసన్నపేట: స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరపూజ, అఖండ దీపాస్థాపన, పుణ్యాహావచనం, పరిషత్‌ ప్రాయశ్చిత్తం, కం కణధారణ నిర్వహించి గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్రస్వాములకు కల్యాణోత్సవం జరిపించారు. కార్య క్రమంలో స్వర్ణకార సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-15T23:51:35+05:30 IST