Home » Sri Satyasai
ఈనెల 13న కళాశాలలో నిర్వహించిన పరీక్షల్లో వెనుక ఉన్న విద్యార్థి ప్రేమ్‌సాయి పేపరులోకి తొంగి చూసినట్లు తెలుస్తోంది. తన పేపరులో ఎందుకు చూస్తున్నావని ప్రేమ్ సాయి ప్రశ్నించగా మాటామాటా పెరిగింది.
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని షామీర్ భాషా కబ్జా చేశాడంటూ మున్సిపల్ కమిషనర్ గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షామీర్ భాషాతోపాటు ఆర్ఐ మున్వర్ భాషా ఇతర వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని నిరుపేద దళిత కుటుంబం... పైగా టీడీపీ అంటే అభిమానం... ఇంకేముంది వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. దాడిచేసి విచక్షణారహితంగా చావబాదడమే కాక.. దీపావళి పండక్కి ఇంటికొచ్చిన యువకుడిని ‘కేసు వెనక్కు తీసుకోకుంటే.. మీ ఫ్యామిలీ మొత్తాన్నీ చంపేస్తాం’ అని బెదిరించాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయించడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టి కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి కోరారు.
జిల్లాలో ఐదు నెలలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్ చేతన అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
మహిళలు మోసపోకుండా జాగృతం చేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి జయలక్ష్మి తెలిపారు.
మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. ఈ మేరకు బుధవారం టీటీడీ బోర్డు కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మనతోపాటు 23 మందికి సభ్యులుగా అవకాశం కల్పించారు.
శ్రీ సత్య సాయి జిల్లా: బత్తలపల్లి మండలం, రామాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రామాపురం బస్ స్టాప్‌కు సమీపంలో తుపాకీ కాల్పుల మోత కలకలం రేపింది. తుపాకుల శబ్దంతో రామాపురం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీహార్‌కు చెందిన దొంగల ముఠా రామాపురం గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నారని గమనించిన తెలంగాణ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
భారతీయ జనతా పార్టీ 18 కోట్ల సభ్యత్వంతో అగ్రగామి పారీగా నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన భారతీయజనతాపార్టీ ఎస్సీ మోర్చా సత్యసాయిజిల్లా సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
స్మార్ట్ మీటర్ల రాకతో రీడర్ల బతుకు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చాలీచాలని వేతనాలతో కొనసాగుతున్నారు.