విశాఖ ఎక్స్‌ప్రెస్ అనుకొని..
ABN , First Publish Date - 2023-02-25T23:17:20+05:30 IST
పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి చెందిన పరిమళ సూర్య అనే యువకుడు విశాఖ వెళ్లేందుకు శనివారం మధ్యాహ్నం ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. విశాఖ ఎక్స్‌ప్రెస్ అని పొరపా టున ప్లాట్‌ఫారంపై ఉన్న సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కాడు. రైలు కదిలిన తరువాత విశాఖ ఎక్స్‌ప్రెస్ కాదని తెలిసి కంగారుపడ్డాడు.
విశాఖ ఎక్స్‌ప్రెస్ అనుకొని..
-సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కిన యువకుడు
-కదులుతున్న రైలు దిగే క్రమంలో తీవ్ర గాయాలు
ఆమదాలవలస: పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి చెందిన పరిమళ సూర్య అనే యువకుడు విశాఖ వెళ్లేందుకు శనివారం మధ్యాహ్నం ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. విశాఖ ఎక్స్‌ప్రెస్ అని పొరపా టున ప్లాట్‌ఫారంపై ఉన్న సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కాడు. రైలు కదిలిన తరువాత విశాఖ ఎక్స్‌ప్రెస్ కాదని తెలిసి కంగారుపడ్డాడు. కదులుతున్న రైలు నుంచి ప్లాట్‌ఫారంపై దూకే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువకుడి తలకు, కాలికి బలమైన గాయాలయ్యాయి. అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు, రైల్వే పోలీసులు సపర్యలు చేశారు. 108కు సమాచారం అందించారు. సు మారు అరగంట పాటు అక్కడే గాయాలతో పడి ఉన్నా రైల్వే వైద్య సిబ్బంది స్పందించకపోవడం విమర్శలకు తావిచ్చింది. చివరకు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటివ రకూ రైల్వే జీఆర్‌పీ ఉమెన్ పీసీ ఉమా సపర్యలు చేసి మానవత్వం చాటుకున్నారు.