Tamato Price: బంగారంతో టమాటా పోటీ.. కిలో ఎంతంటే?

ABN , First Publish Date - 2023-07-26T10:44:52+05:30 IST

ఈ మధ్య కాలంలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది.

Tamato Price: బంగారంతో టమాటా పోటీ.. కిలో ఎంతంటే?

విజయవాడ: ఈ మధ్య కాలంలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. గత నెల రోజులుగా టామటా ధర చుక్కలు చూపిస్తోంది. ఒకానొక సమయంలో కిలో టమాట ధర రూ.200లకు కూడా చేరింది. టమాటా ధరలు చూస్తే బంగారంతో పోటీపడుతోందా అన్న విధంగా తయారైంది. టమాటా ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో ప్రజల కోసం ప్రభుత్వం సబ్సీడీ రూపంలో టమాటాలు కొనేందుకు వెసులుబాటు కలిగించింది. మరోవైపు రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. కానీ సబ్సిడీ టమాటాలు కొనేందుకు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా గొడుగులు వేసుకొని మరీ మహిళలు వస్తున్నారు. రైతు బజార్ల యాజమాన్యం రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి సబ్సీడీ టమాటాలు ఇస్తున్నారు. కేజీ రూ.50 చొప్పున సబ్సీడీ టమాటాలు అమ్ముతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టమాటాలు రైతు బజార్ యాజమాన్యం ఇస్తోంది. ప్రతీరోజు విజయవాడ రైతు బజార్లకు వస్తున్న 10 టన్నుల టమాటాలు వస్తున్నాయి. మదనపల్లి, పలాస నుంచి విజయవాడ రైతుబజార్లకు టమాటాలను తరలిస్తున్నారు.

Updated Date - 2023-07-26T10:44:52+05:30 IST