Avinash Reddy: సీబీఐ వాదనలు వినేసి అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే..

ABN , First Publish Date - 2023-05-27T14:40:49+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై..

Avinash Reddy: సీబీఐ వాదనలు వినేసి అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే..

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వచ్చే బుధవారం నాడు తుది తీర్పు వెలువరించనుంది. బుధవారం లోపు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాశ్ చేసిన అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. బుధవారం తీర్పు వెలువరించేవరకూ అవినాశ్‌ను అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శనివారం నాడు సీబీఐ వాదనలు వినిపించింది. శుక్రవారం నాడు అవినాశ్ తరపు లాయర్, సునీత తరపు లాయర్ వాదనలను తెలంగాణ హైకోర్టు విన్న సంగతి తెలిసిందే. శనివారం నాడు (మే 27, 2023) సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌ వాదనలు వినిపించారు. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. అవినాశ్‌ను కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సి ఉందని హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులిచ్చినా అవినాశ్‌రెడ్డి పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తులో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తు తమ పద్ధతి ప్రకారం చేస్తాం కానీ అవినాశ్‌ కోరుకున్నట్లు కాదని సీబీఐ తరపు లాయర్‌ అనిల్‌ కోర్టుకు స్పష్టం చేశారు.

హైకోర్టులో సీబీఐ వాదనలు-హైకోర్టు ప్రశ్నలు ఎలా సాగాయంటే..

* హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారు.. ప్రధాన కారణమేంటి?: హైకోర్టు

* వివేకా హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగింది: సీబీఐ

* వివేకా హత్య రాజకీయ కారణాలతోనే జరిగింది: సీబీఐ

* అవినాశ్‌ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి: సీబీఐ

* ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగింది: సీబీఐ

* అవినాశ్‌రెడ్డి రాజకీయంగా అంత ప్రభావిత వ్యక్తి అయితే...

* వివేకాను చంపాల్సిన అవసరమేంటి?: హైకోర్టు

* 2017 ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా..హత్య వరకు వెళ్తారా?: హైకోర్టు

* వాదనలు వింటున్న సీబీఐ ఎస్పీ వికాస్‌ సింగ్‌, ASP ముఖేష్‌ శర్మ, సునీత

* కడప ఎంపీ టికెట్‌ విజయలక్ష్మి లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు

* వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాశ్‌ భావించారు: సీబీఐ

* భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ రెడ్డి అరెస్టుకు కారణాలు ఏమిటి?: హైకోర్టు

* కుట్రలో ప్రమేయం దృష్ట్యా భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ అరెస్ట్‌: సీబీఐ

* కస్టడీ విచారణలో భాస్కర్‌, ఉదయ్‌ నుంచి ఏం తెలుసుకున్నారు?: హైకోర్టు

* భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ రెడ్డి విచారణకు సహకరించలేదు: సీబీఐ

* హత్యకు గంగిరెడ్డి ద్వారా అవినాశ్‌రెడ్డి కుట్ర చేశారు: సీబీఐ

* శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి ద్వారా హత్యకుట్ర అమలు చేశారు: సీబీఐ

* వివేకాపై కోపం ఉన్నవారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగారు: సీబీఐ

* శత్రువుకు శత్రువు మిత్రుడనే విధానం ఇక్కడ అమలు చేశారు: సీబీఐ

* అవినాశ్‌ రెడ్డి నుండే డబ్బులు వాచ్చాయని దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు

* అవినాశ్‌రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఇస్తే.. తను గంగిరెడ్డికి ఇచ్చారు: సీబీఐ

* రూ.4 కోట్లు ఖర్చు పెట్టడానికి శివశంకర్ రెడ్డికి ఏం అవసరం ఉంది?: సీబీఐ

* రూ. 75 లక్షల్లో 46 లక్షలు మున్నా లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నాం: సీబీఐ

* వివేకా మృతదేహం చూడగానే గాయాలు కనిపించాయా?: హైకోర్టు

* వివేకా మృతదేహం చూసిన ఎవరైనా సరే అది మర్డర్ అని చెప్పగలరు?: సీబీఐ

* అలాంటప్పుడు రక్తపు మరకలు తుడచడం ఎవిడెన్స్ టెంపర్ ఎలా అవుతుంది?: హైకోర్టు

* మృతదేహం చూస్తే మర్డర్‌గా తెలుస్తుంది.. రక్తపు మరకలతో అవసరం లేదు: హైకోర్టు

* రక్తపు వాంతులు చేసుకుంటే 2 లీటర్ల రక్తం బయటికి రాదు: సీబీఐ

* వివేకా గదిలో రక్తం కడిగేసి సాక్ష్యాలను చెరిపేశారు: సీబీఐ

* గాయాలు చూస్తే హత్య అని ఎవరైనా చెబుతారు కాదా?: హైకోర్టు

* గదిలో రక్తం తుడిచేస్తే సాక్ష్యాలకు నష్టమేంటి?: హైకోర్టు

* శివశంకర్‌రెడ్డి చెప్పినట్టుగానే కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు: సీబీఐ

* శంకర్‌రెడ్డి భయంతో సీఐ శంకరయ్య వాస్తవ పరిస్థితిని నమోదు చేయలేదు

* ఫిర్యాదులో రక్తపు మరకల విషయం ప్రస్తావించలేదు: సీబీఐ

* వివేకా రాసిన లెటర్ దాయడంలో ఎలాంటి కుట్ర లేదు: సీబీఐ

* సేఫ్ సైడ్ కోసమే లెటర్ దాచినట్టు నిర్ధారణ: సీబీఐ

* లెటర్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం: సీబీఐ

* లెటర్‌పై హ్యాండ్ రైటింగ్ వివేకా రాసినట్టు దర్యాప్తులో తేలింది: సీబీఐ

* అప్పటి సిట్ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల బదిలీలు..

* నియామకాలకు సంబందించి అవినాష్, శివశంకర్ వాట్సాప్ చాట్ ఉంది

* పోస్టుమార్టం కోసం ఇంటి నుంచి తీసుకెళ్లినప్పుడు డాక్టర్ ఉన్నారా?: హైకోర్టు

* ఉదయం 9.30కి ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు: అవినాశ్‌ న్యాయవాది

* FIR నమోదు చేయమని శంకరయ్యకు చెప్పింది సునీత భర్త రాజశేఖర్ రెడ్డి

* అవినాశ్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి ఎవరూ వివేక హత్యపై ఫిర్యాదు చేయలేదు: సీబీఐ

* వివేకా హత్య తర్వాత ఉ.5.20కి గంగిరెడ్డితో పాటు మిగిలిన నిందితులతో ఎంపీ అవినాశ్‌ రెడ్డి మాట్లాడాడని చెప్పారు: సీబీఐ

* మార్చి 15న ఉ.1.50 నుంచి 5.30 వరకు అవినాశ్‌ కాల్స్ మాట్లాడిన డేటా ఉంది

* మే 12న అవినాష్ ఫోన్ ఐడీపీఆర్‌ డేటా తీశాం: సీబీఐ

* గంగిరెడ్డి వాట్సాప్ చాట్ గురించి అడిగారా?: హైకోర్టు

* విచారణలో గంగిరెడ్డి అవినాశ్‌తో చాట్ చేసినట్టు ఒప్పుకోలేదు: సీబీఐ

* అవినాశ్‌ విచారణ టైంలో ఫోన్ స్వాధీనం చేసుకున్నారా?: హైకోర్టు

* అవినాశ్‌రెడ్డి ఎవరితో వాట్సాప్ చాట్‌ చేశారు?: హైకోర్టు

* వాట్సాప్ కాల్స్‌ మాట్లాడినట్టు మాత్రమే తెలుస్తుంది: సీబీఐ

* వాట్సాప్ కాల్ ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేం: సీబీఐ

* ఎవరితో మాట్లాడారో తెలుసుకునేందుకే అవినాశ్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలంటున్నాం: సీబీఐ

* అవినాశ్‌ వాట్సాప్‌లో ఉన్న టైంలో గంగిరెడ్డి వాట్సాప్‌ బిజీగా ఉందా?: హైకోర్టు

* ఈ నెల 12నే అవినాశ్‌రెడ్డి ఐపీడీఆర్ డేటాను సేకరించాం: సీబీఐ

* కుట్రలో అవినాశ్‌ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఎప్పటి నుంచో అనుమానిస్తోంది కదా?: హైకోర్టు

* అవినాశ్‌రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా?: హైకోర్టు

* కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి?: హైకోర్టు

* వివేకా హత్య జరిగిన సమయం చెప్పండి: హైకోర్టు

* తెల్లవారుజామున 1.10 నుంచి 1.30 మధ్యలో వివేకా హత్య జరిగింది: సీబీఐ

* హత్య తర్వాత రోజు అవినాశ్‌ జమ్మలమడుగు వెళ్తున్నట్టు చెప్పారు

* జమ్మలమడుగు వెళ్తున్నట్టు అవినాశ్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు

* ఆరోజు జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ లేదు: సీబీఐ

* వివేకా హత్య గురించి ముందే తెలిసినా మరో వ్యక్తి నుంచి న్యూస్‌ వచ్చే వరకు అవినాశ్‌ ఇంట్లోనే ఉన్నారు

* అవినాశ్‌ ఆ టైమ్‌లో ఇంట్లోనే ఉన్నాడని ఎలా చెబుతారు?: హైకోర్టు

* అవినాశ్‌కు ముందే తెలుసు అనడానికి ఏం ఆధారాలున్నాయి?: హైకోర్టు

Updated Date - 2023-05-27T14:45:27+05:30 IST