AP Bhavan: ఏపీభవన్ విభజనపై సమావేశం మరోసారి వాయిదా.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-04-24T10:21:33+05:30 IST

ఏపీ భవన్ విభజనపై సమావేశం మరోసారి వాయిదా పడింది.

AP Bhavan: ఏపీభవన్ విభజనపై సమావేశం మరోసారి వాయిదా.. ఎందుకంటే..

న్యూఢిల్లీ: ఏపీ భవన్ విభజనపై (AP Bhavan)సమావేశం మరోసారి వాయిదా పడింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి (Union Home Secretary Joint Secretary) నేతృత్వంలో ఈరోజు జరగాల్సిన సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులకు హోంశాఖ అధికారులు సమాచారం పంపించారు. ఈనెల 26న (బుధవారం) కేంద్ర హోం శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌లో సమావేశం జరుగనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (సెంటర్ స్టేట్ రిలేషన్స్ విభాగం) సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరగనుంది. బుధవారం జరిగే ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు హాజరుకానున్నట్లు సమాచారం. ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ (AP Finance Chief Secretary SS Rawat), తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె రామకృష్ణ రావు (Telangana Finance Department Special Secretary K Ramakrishna Rao) హజరవుతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం ఢిల్లీలోని ఏపీ భవన్ 10 ఏళ్ళలో విభజన కావాల్సి ఉంది. ప్రస్తుతం 48శాతం తెలంగాణ, 52 శాతం ఏపీ వాటాగా ఆస్తులు పంచుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తులు పంచుకోవాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-04-24T10:21:33+05:30 IST