Lokesh Padayatra: లోకేష్ ఇంత హుషారుగా పాదయాత్ర చేయడానికి సీక్రెట్ ఇదే..

ABN , First Publish Date - 2023-03-03T20:53:26+05:30 IST

టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించిన.. యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతోంది.

Lokesh Padayatra: లోకేష్ ఇంత హుషారుగా పాదయాత్ర చేయడానికి సీక్రెట్ ఇదే..

తిరుపతి: టీడీపీ (TDP) నేత నారా లోకేశ్ (Nara Lokesh) కొనసాగిస్తున్న యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరుగుతోంది. పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లోకేశ్‌లో హుషారు ఏ మాత్రం తగ్గలేదు. అదే ఉత్సాహం.. అదే చొరవ తగ్గేదేలా అన్నట్లు ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో రోజంతా ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం క్యాంప్‌ సైట్‌ వద్ద సుమారు వెయ్యి మందితో సెల్ఫీలు.. వివిధ సామాజిక వర్గాలు, సంఘాలతో సమావేశాలు, బహిరంగ సభలు, నాయకులతో సమీక్షలు.. పాదయాత్రలో కలిసేవారితో ఆప్యాయ పలకరింపులు, పోలీసుల అడ్డంకులు.. దాదాపుగా ప్రతిరోజు ఇలా పాదయాత్ర సాగుతోంది. అయినా, ఆయనలో అలసట కనిపించడం లేదు. పాదయాత్ర ప్రారంభంలో లోకేశ్‌ వేగంగా నడుస్తున్నారని ప్రధాన నాయకులంతా చెప్పడంతో.. కొంత వేగాన్ని తగ్గించారు. అయినా ఇప్పుడు కూడా లోకేశ్‌ నడుస్తుంటే ఆయన వెంట వస్తున్న నాయకులు, కార్యకర్తలు పరిగెత్తాల్సి వస్తోంది. ఈ క్రమంలో పాదయాత్ర (Padayatra) సందర్భంగా లోకేశ్‌ దినచర్య.. ఆహారం ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ (TDP) వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయనలో ఇంతటి హుషారుకుకారణమైన దినచర్యను ఒకసారి పరిశీలిద్దాం...

లోకేశ్ దినచర్య ఇదే

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తారు. 6.30 గంటల్లోగా ఫ్రెష్‌ అయి బ్లాక్‌ కాఫీ తాగుతారు. 7 గంటల వరకు పేపర్లు చదివి, పీఆర్‌ టీమ్‌తో బ్రీఫింగ్‌ తీసుకుంటారు. 7.30 వరకు వ్యాయామం చేస్తారు. 7.50కి స్నానం చేసి రెడీ అయిపోతారు. 8 గంటలకు అల్పాహారం తీసుకుంటారు. 8.30 వరకు నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత గంటపాటు సెల్ఫీ విత్‌ లోకేశ్‌ కార్యక్రమంలో ప్రతిరోజూ సుమారు వెయ్యి మందితో సెల్ఫీలు తీసుకుంటారు. 9.30 గంటలకు ఒక లీటరు నీళ్లు తాగాక పాదయాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు కొబ్బరి నీళ్లు తాగి, 1.00- 1.30 మధ్యలో మధ్యాహ్న భోజనం తీసుకుంటారు. 1.30- 2.00 మధ్యలో నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రంలోగా మరో లీటరు నీళ్లు తాగుతారు. సాయంత్రం 5 గంటలకు మరోసారి కొబ్బరినీళ్లు తాగుతారు. 7 గంటలకు శిబిరం వద్దకు చేరుకుంటారు. 7.30 గంటలకు నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. 8.00 - 8:30 గంటల మధ్యలో ఉడకబెట్టిన వెజిటబుల్స్‌తో రాత్రి భోజనం చేస్తారు.

Updated Date - 2023-03-03T21:02:28+05:30 IST