LokeshPadayatra: లోకేశ్ పాదయాత్రలో రేపు కీలక ఘట్టం
ABN , First Publish Date - 2023-02-20T20:49:25+05:30 IST
రేపు (సోమవారం) తిరిగి నారా లోకేశ్ (NaraLokesh) యువగళం పాదయాత్ర ప్రారభం కానుంది. రేపు మరో ముఖ్యఘటం పాదయాత్రలో ఆవిష్కృతం కానుంది.
తిరుపతి: రేపు (సోమవారం) తిరిగి నారా లోకేశ్ (NaraLokesh) యువగళం పాదయాత్ర ప్రారభం కానుంది. రేపు మరో ముఖ్యఘటం పాదయాత్రలో ఆవిష్కృతం కానుంది. రేపు 300 కిలోమీటర్ల దూరాన్ని లోకేశ్ అధిగమించనున్నారు. ఆ సందర్భంగా అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. పాదయాత్ర 22వ రోజైన ఈనెల 17వ తేదీ శుక్రవారం రాత్రి బస చేరేసరికి లోకేశ్ మొత్తం 296.6 కిలోమీటర్ల దూరం నడిచారు. 18వ తేదీ శనివారం మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినం సందర్భంగా పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. శివరాత్రి రోజు సాయంత్రం నందమూరి తారకరత్న (Tarakaratna) మృతి చెందడంతో లోకేశ్ హుటాహుటిన హైదరాబాదు బయల్దేరి వెళ్ళారు. తారకరత్న మృతితో 19, 20 తేదీలలో కూడా పాదయాత్రకు విరామం ప్రకటించారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన దూరం 296.6 కిలోమీటర్లు
23వ రోజు యువగళం పాదయాత్ర షెడ్యూల్
ఉ.8 గం.లకు శ్రీకాళహస్తి నుంచి పాదయాత్ర ప్రారంభం
8.20 గం.లకు మిట్టకండ్రిగలో స్థానికులతో మాటామంతి
10 గంటలకు తొండంనాడులో స్థానికులతో మాటామంతి
10.15 గం.లకు తొండమానుపురం దిగువ వీధిలో..
300 కి.మీ పూర్తి చేసిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ
10.20 గం.లకు తొండమానుపురం దిగువ వీధిలో మహిళలతో ముఖాముఖీ
11.10 గం.లకు సుబ్బానాయుడు కండ్రికలో స్థానికులతో మాటామంతి
మ.12.30 గం.లకు వెంకటాపురంలో భోజన విరామం
2 గం.లకు బండారుపల్లిలో స్థానికులతో మాటామంతి
సా.4.30 గం.లకు కోబాకలో వన్యకుల క్షత్రియులతో సమావేశం
5.30 గం.లకు కోబాక విడిది కేంద్రంలో రాత్రి బస