Trains Cancelled : గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఏ ఏ రైళ్లు రద్దయ్యాయంటే...
ABN , First Publish Date - 2023-06-14T09:21:02+05:30 IST
ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒరిస్సా రైలు దుర్ఘటన అనంతరం ఎక్కడో ఒక చోటు ఏదో ఒక రైలు పట్టాలు తప్పడమో.. మరోకటో జరుగుతూనే ఉంది. తాజాగా విజయవాడ డివిజన్ పరిధిలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అనకాపల్లి - తాడి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు రైళ్లు రద్దయ్యాయి.
అనకాపల్లి : ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒరిస్సా రైలు దుర్ఘటన అనంతరం ఎక్కడో ఒక చోటు ఏదో ఒక రైలు పట్టాలు తప్పడమో.. మరోకటో జరుగుతూనే ఉంది. తాజాగా విజయవాడ డివిజన్ పరిధిలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అనకాపల్లి - తాడి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు రైళ్లు రద్దయ్యాయి.
ఏఏ రైళ్లు రద్దయ్యాయంటే..
12805- 06 - జన్మభూమి - రాకపోకలు రద్దు
22701-02 ఉదయ్ ఎక్స్‌ప్రెస్ - రాకపోకలు రద్దు
17240-39 - సింహాద్రి - రాకపోకలు రద్దు
20833 - విశాఖ - సికింద్రాబాద్ - వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా నడుస్తోంది.