Viveka Case : ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడగింపు
ABN , First Publish Date - 2023-04-26T14:08:46+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ముగియడంతో అతడిని సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ముగియడంతో అతడిని సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వివేకా హత్య కేసులో A6 ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్ట్.. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. తిరిగి ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు చంచల గూడ జైలుకు తరలించారు.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని కొద్ది రోజుల క్రితం సీబీఐ అరెస్టు చేసింది. వివేకాను 2019 మార్చి 15న తెల్లవారుజామున 1.30 నుంచి 3 గంటల మధ్య నిందితులు హత్య చేశారు. దేవిరెడ్డి శివశంక ర్‌రెడ్డి ఆదేశాల మేరకు వివేకా మృతదేహానికి కట్లు కట్టడానికి వైద్యులను, సిబ్బందిని తీసుకురావడం, బ్యాండేజీలు తీసుకురావడం, ఫ్రీజర్‌బాక్సు, అంబులెన్స్ ఏర్పాటులో ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలక పాత్ర పోషించాడని సీబీఐ చెబుతోంది. ఈయన తండ్రి జయప్రకాశ్‌రెడ్డి.. ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండరు. వివేకా తలకు ఉన్న గొడ్డలిపోట్లకు జయప్రకాశ్‌రెడ్డిని పిలిపించే కుట్లు, బ్యాండేజీ వేయించారని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేగాక.. వివేకా హత్య జరిగిన రోజు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో కలిసి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా ఆధారాలు సేకరించింది. వివేకా హత్య గురించి 2009 మార్చి 15న ఉదయం 6.26 గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. అయితే ఉదయ్‌కుమార్‌రెడ్డి 6.25 గంటలకే అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని.. తర్వాత 6.29 గంటల నుంచి 6.31 గంటల వరకు వివేకా ఇంట్లో కూడా ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ నిర్ధారణకు వచ్చింది.