AP News: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై వర్ల రామయ్య ఫైర్
ABN , Publish Date - Dec 28 , 2023 | 05:24 PM
శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజేంద్రనాధరెడ్డి వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా? అని ప్రశ్నించారు.
విశాఖపట్నం: శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజేంద్రనాధరెడ్డి వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు అపాయింట్‌మెంట్ కోరితే రాజేంద్రనాధరెడ్డి ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకులు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు.
వైసీపీవారు అపాయింట్‌మెంట్ కోరితే గేటు వద్దకు వచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. సభ్యతా సంస్కారాలు లేని ‘వ్యూహం’ సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అపాయింట్‌మెంట్ అడిగితే డీజీపీ బయటికొచ్చి మరీ కార్యాలయంలోకి తీసుకెళ్లారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర డీజీపీ రోజు రోజుకూ దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.