AP News: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి
ABN , First Publish Date - 2023-07-03T10:10:33+05:30 IST
వైద్యుల నిర్లక్షం కారణంగా నిండు గర్భిణి మృతి చెందిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
విజయవాడ: వైద్యుల నిర్లక్షం కారణంగా నిండు గర్భిణి మృతి చెందిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీని డెలివరీ నిమిత్తం ఏలూరు నుంచి విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రికి తరలచారు. అయితే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసే క్రమంలో బిడ్డ మృతి చెందింది. ఈరోజు ఉదయం తల్లి కూడా మృతి చెందిందని, ఏలూరు తీసుకువెళ్లిపొండి అంటూ వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తల్లి, బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి వైద్యం అందించకపోవడం వల్ల తల్లీబిడ్డ మృతి చెందారని కుటుంబసభ్యులు ఆరోపించారు. రాత్రి విధుల్లో ఉన్నటువంటి వైద్యుల్ని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, విద్యాసంఘాలు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు.