Share News

Judgement: బాలికను గర్భవతి చేసిన 55 ఏళ్ల వ్యక్తి.. 20 ఏళ్ల జైలు శిక్ష విధింపు

ABN , Publish Date - Dec 29 , 2023 | 08:05 PM

Judgement: బాలికను గర్భవతి చేసిన నిందితుడికి విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 2018లో న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరుపల్లి దేముడు (55) అనే వ్యక్తి బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. తాజాగా నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది.

Judgement: బాలికను గర్భవతి చేసిన 55 ఏళ్ల వ్యక్తి.. 20 ఏళ్ల జైలు శిక్ష విధింపు

బాలికను గర్భవతి చేసిన నిందితుడికి విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 2018లో న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరుపల్లి దేముడు (55) అనే వ్యక్తి బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. తాజాగా నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. అలాగే బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కీచక టీచర్‌కు కూడా విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు రెండు రోజుల క్రితం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి పదో తరగతి చదువుతున్న బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన జానకేశ్వరరావుకు 25 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2020లో విశాఖ నాలుగో పట్టణ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 29 , 2023 | 08:05 PM