YCP Minister: విశాఖకు ప్యాకేజీ స్టార్ వస్తున్నారంటూ పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-09T17:43:12+05:30 IST

విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్ అడ్డుకోలేదు. బీజేపీతో సంసారం...టీడీపీతో సహజీవనం జనసేన వేస్తున్నారు. టీడీపీ హయాంలో గుళ్ళు కూలకొడితే...ప్యాకేజీ స్టార్ మాట్లాడలేదు.

YCP Minister: విశాఖకు ప్యాకేజీ స్టార్ వస్తున్నారంటూ పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Janasena chief Pawan Kalyan) వైసీపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (YCP Minister Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు.


"రేపటి నుంచి పవన్ ఉమ్మడి విశాఖలో వారాహి వెబ్ సిరీస్ 3 విశాఖలో జరుగుతుంది. విశాఖకు, ఉత్తరాంధ్ర అన్యాయంపై నిలదీయడానికి ప్యాకేజీ స్టార్ వస్తున్నారట. పవన్‌కు 10 ప్రశ్నలు వేస్తున్నాను. సమాధానం చెప్పాలి. విశాఖకు వచ్చిన తర్వాత అయినా పవన్ చెప్పాలి. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని.. ఉమ్మడి విశాఖకు వస్తారా? ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి. ఏం విజయం సాధించారని? వారాహి యాత్ర చేస్తారు?. 175కి 175 పోటీ చేస్తానని పవన్ చెప్పాలి. విశాఖలో మీ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పండి. జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు పేరు చెప్పండి. విశాఖను పరిపాలన రాజధాని ప్రకటించినప్పుడు..పవన్ స్వాగస్తున్నామని చెప్పలేదు. టీడీపీ స్టాండే... జనసేన స్టాండు. బీజేపీతో పొత్తు ఉన్నా. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్ అడ్డుకోలేదు. బీజేపీతో సంసారం...టీడీపీతో సహజీవనం జనసేన వేస్తున్నారు. టీడీపీ హయాంలో గుళ్ళు కూలకొడితే...ప్యాకేజీ స్టార్ మాట్లాడలేదు." అని మంత్రి మండిపడ్డారు.


"పవన్ కళ్యాణ్ అప్పుడు పాచిపోయిన లడ్డూ అన్నారు...ఇపుడు లాడ్డూలు తీయగా ఉన్నాయా?. బీజేపీ చంక పవన్ కళ్యాణ్ ఏక్కారు. ఉద్దానంలో ఆసుపత్రి నిర్మిస్తే...కనీసం జగన్ ని అభినందించడం లేదు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వాలంటీర్లకు క్షపాణలు చెప్పాలి. పుంగనూరులో అలాంటి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. 45 మంది పోలీసు అధికారులకు గాయాలు అయితే...పోలీసు కొడుకు అని చెప్పు కునే పవన్ స్పందించాలి. నేను వేసిన 10 ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలి. జగన్‌ను తిట్టడానికే విశాఖకు పవన్ వస్తున్నారు. బ్రో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ లేవు. బ్రో సినిమా తుస్ బ్రో. పవన్ లాగా రీల్ హీరో కాదు. రియల్ హీరో జగన్. అనకాపల్లిలో సెక్షన్ 30 ఎప్పుడూ అమలు ఉంటుంది. విసన్న పేట 600 ఎకరాలు కబ్జా చేశామని నా మీద ఆరోపణలు చేశారు. సెంటు కూడా నాకు లేదు. అత్తారింటికి దారేదీ అంటే..విశాఖ, ముంబాయి, రష్యా గుర్తుకు వస్తాయి. విశాఖ ఆడబిడ్డ, కాపు బిడ్డకు పవన్ అన్యాయం చేశారు. నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. విసన్న పేటకు పవన్ కళ్యాణ్ వేస్తే అభ్యంతరం లేదు...ఆయన వచ్చినా పర్వాలేదు, లేదా ఆయన అన్న, తమ్ముడు, కొడుకు వచ్చినా పర్వాలేదు. చంద్రబాబునాయుడిని ఎవరూ చంపాల్సిన అవసరం లేదు. 150 ఏళ్లు చంద్రబాబు బతకాలని కోరుకుంటున్నాం. దసరాకి ముఖ్యమంత్రి కానుక ఇస్తారు." అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

Updated Date - 2023-08-09T18:06:40+05:30 IST