అరకు రైలుకు అదనపు విస్టాడోమ్‌ కోచ్‌

ABN , First Publish Date - 2023-03-01T01:57:23+05:30 IST

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అరకులోయ మీదుగా రాకపోకలు సాగించే 08551, 08552 నంబర్లు గల విశాఖపట్నం-కిరండోల్‌ రైళ్లకు బుధవారం నుంచి (మార్చి ఒకటి) కొన్ని ప్రత్యేక తేదీల్లో ఒక విస్టా డోమ్‌ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

అరకు రైలుకు అదనపు విస్టాడోమ్‌ కోచ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 28:

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అరకులోయ మీదుగా రాకపోకలు సాగించే 08551, 08552 నంబర్లు గల విశాఖపట్నం-కిరండోల్‌ రైళ్లకు బుధవారం నుంచి (మార్చి ఒకటి) కొన్ని ప్రత్యేక తేదీల్లో ఒక విస్టా డోమ్‌ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ నుంచి కిరండోల్‌ వెళ్లే 08551 నంబర్‌ గల రైలుకు మార్చి 1,3,5,7,9,11,13,15,17,19,21,23,25,27,29,31, ఏప్రిల్‌ 2,4,6,8,10 తేదీల్లో....కిరండోల్‌ నుంచి విశాఖ వచ్చే 08552 నంబరు గల రైలుకు మార్చి 2,4,6,8,10,12,14,16,18,20,22,24,26,28,30, ఏప్రిల్‌ 1,3,5,7,9,11 తేదీల్లో ఈ అదనపు విస్టాడోమ్‌ కోచ్‌ అందుబాటులో వుంటుందని పేర్కొన్నారు.

మరికొన్ని రైళ్లకు తాత్కాలిక అదనపు కోచ్‌లు

గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (17243), గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు (17239) ఈనెల ఒకటి నుంచి ఆరు వరకు; రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17244), విశాఖ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లకు (17240) ఈనెల రెండు నుంచి ఏడో తేదీ వరకు అదనంగా రెండు జనరల్‌ కోచ్‌లు జత చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-03-01T01:57:23+05:30 IST