సోషల్‌ మీడియా మోసాలకు అడ్డుకట్ట వేయాలి

ABN , First Publish Date - 2023-03-15T00:56:44+05:30 IST

సోషల్‌ మీడియా వేదికగా యువతే లక్ష్యం చేసుకుని ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, ట్విట్టర్‌ల్లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వియ్యపు రాజు డిమాండ్‌ చేశారు.

సోషల్‌ మీడియా మోసాలకు అడ్డుకట్ట వేయాలి
మాట్లాడుతున్న ఏఐవైఎఫ్‌ నాయకుడు రాజు

తుమ్మపాల(అనకాపల్లి), మార్చి 14: సోషల్‌ మీడియా వేదికగా యువతే లక్ష్యం చేసుకుని ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, ట్విట్టర్‌ల్లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వియ్యపు రాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను తప్పుదోవ పట్టిస్తూ వారి జీవితాలు ఛిద్రం చేస్తున్నాయని ఆరోపించారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు కళ్లు మూసుకోవడం దారుణమన్నారు. ఈ అంశంపై ఏఐవైఎఫ్‌ పోరాటం సాగిస్తుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు కన్నబాబు, సాయి, ఆనంద్‌, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-15T00:56:44+05:30 IST