అమృత్‌ భారత్‌లో అనకాపల్లి రైల్వేస్టేషన్‌

ABN , First Publish Date - 2023-03-07T01:08:10+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద అనకాపల్లి రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసిందని ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు ఎలమంచిలి స్టేషన్‌ను ఈ పథకంలో చేర్చారని పేర్కొన్నారు.

అమృత్‌ భారత్‌లో అనకాపల్లి రైల్వేస్టేషన్‌
అనకాపల్లి రైల్వే స్టేషన్‌

ఎలమంచిలికి కూడా చోటు..

ఆధునిక సదుపాయాలతో మోడల్‌ స్టేషన్లుగా అభివృద్ధి

ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి

అనకాపల్లి టౌన్‌, మార్చి 6: కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద అనకాపల్లి రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసిందని ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు ఎలమంచిలి స్టేషన్‌ను ఈ పథకంలో చేర్చారని పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశానని, అమృత్‌ భారత్‌ పథకం జాబితాలో ఈ స్టేషన్‌ను చేర్చినట్టు ఇటీవల వెల్లడించారని ఆమె తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తారని, లిఫ్ట్‌, ఎస్కలేర్‌, ఆధునిక టాయిలెట్లు, వెయిటింగ్‌ హాల్‌, ఉచిత వైఫై, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాట్‌ ఫారాలపై స్టీల్‌ బెంచీలు, తాగునీటి సదుపాయం, ఫుడ్‌కోర్టు, మొబైల్‌ బుక్‌స్టాల్‌, స్థానిక హస్తకళల ఉత్పత్తుల విక్రయం కేంద్రం వంటివి ఏర్పాటు చేస్తారు. అనకాపల్లి స్టేషన్‌ అభివృద్ధికి రూ.15-20 కోట్లు ఖర్చు చేసే అవకాశం వుందని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఎలమంచిలి స్టేషన్‌ను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేస్తారని ఎంపీ చెప్పారు.

Updated Date - 2023-03-07T01:08:10+05:30 IST