కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలి

ABN , First Publish Date - 2023-01-25T00:41:21+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు మంగళవారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలి
ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

రావికమతం, జనవరి 24: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు మంగళవారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఎస్‌.సత్యవేణి మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీల వేతనాన్ని ప్రభుత్వం సవరించలేదన్నారు. ఈ కారణంగా జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గ్రాట్యూటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వాలన్న డిమాండ్‌ ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదన్నారు. విధుల్లో చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల ర్యాలీలు, ధర్నాలు నిషేధిస్తూ జారీ చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో ఫిబ్రవరి ఆరున జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలపనున్నట్టు ఆమె తెలిపారు.

Updated Date - 2023-01-25T00:41:23+05:30 IST