పాలనురగ పొంగిపొర్లుతున్నట్టుగా...
ABN , First Publish Date - 2023-05-07T23:21:27+05:30 IST
ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దు ప్రాంతంలో గల తారాబు జలపాతం ఉరకలేస్తూ ప్రవహిస్తున్నది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి జలపాతంలో చేరుతోంది.
ఉరకలేస్తున్న తారాబు జలపాతం
ముంచంగిపుట్టు, మే 7: ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దు ప్రాంతంలో గల తారాబు జలపాతం ఉరకలేస్తూ ప్రవహిస్తున్నది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి జలపాతంలో చేరుతోంది. దీంతో ఎత్తైన గిరులపై నుంచి జాలువారుతున్న జలపాత సౌందర్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. గత కొద్ది రోజులుగా ఈ జలపాతం వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. రెండు మండలాల సరిహద్దు ప్రాంతమైన గిన్నెలకోట పంచాయతీ పిట్టలబొర్ర గ్రామ సమీపంలో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు.