నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాక
ABN , First Publish Date - 2023-07-28T00:40:59+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నగరానికి వస్తున్నారు.
విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నగరానికి వస్తున్నారు. ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కావడంతో పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆమె ఢిల్లీ నుంచి ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్‌ఏడీ జంక్షన్, కంచరపాలెం మెట్టు, తాటిచెట్లపాలెం మీదుగా మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డు మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. అనంతరం సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాకు వెళతారు. అక్కడ ఉత్తరాంధ్ర పార్టీ జోనల్ నాయకులతో సమావేశం అవుతారని నగర పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర తెలిపారు.