ఘనంగా ప్రింటర్స్‌ డే వేడుకలు

ABN , First Publish Date - 2023-02-25T00:36:20+05:30 IST

ది చాంబర్‌ ఆఫ్‌ మాస్టర్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌, విశాఖపట్నం ఆధ్వర్యంలో రామ్‌నగర్‌ లయన్స్‌ క్లబ్‌లో ప్రింటర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ప్రింటర్స్‌ డే వేడుకలు
మేయర్‌కు వినతిపత్రం అందిస్తున్న ప్రింటర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు

దొండపర్తి, ఫిబ్రవరి 24 ః ది చాంబర్‌ ఆఫ్‌ మాస్టర్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌, విశాఖపట్నం ఆధ్వర్యంలో రామ్‌నగర్‌ లయన్స్‌ క్లబ్‌లో ప్రింటర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, స్థానిక కార్పొరేటర్‌ పి.దుర్గాప్రసాద్‌ విచ్చేసి ముద్రణ యంత్రాన్ని కనుగొన్న జోహనెస్‌ గూటెన్‌బర్గ్‌ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్య, వైద్యం, పరిశ్రమలలోనే కాకుండా పాలనలో కూడా ముద్రణా రంగ పాత్ర మరువలేనిదని, ముద్రణ లేనిదే సమాజంలో మనుగడ లేదని అలాంటి ముద్రణ రంగాన్ని గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముద్రణ పరిశ్రమకు అండగా తాము ఉంటామని, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరానిన ఆమె ప్రారంభించారు. పలువురు ముద్రాపకులు రక్తదానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డీఎస్‌వీఆర్‌కే రాజు, సెక్రెటరీ జి.రవీంద్రబాబు, వైస్‌ ప్రెసిడెంట్‌ పి.మురళీ కృష్ణారావు, కోశాధికారి కె.రమేష్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు బి.మాధవరావు, వీర్రాజు, చంద్రకాంత్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-25T00:36:22+05:30 IST