28న సీఎం రాక

ABN , First Publish Date - 2023-01-25T00:35:49+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈనెల 28న నగరానికి వస్తున్నారు. ఆయన ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.

28న సీఎం రాక

శారదా పీఠం వార్షికోత్సవం సహా

పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరు

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈనెల 28న నగరానికి వస్తున్నారు. ఆయన ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా చినముషిడివాడలో గల శారదా పీఠానికి వెళతారు. పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి కైలాసపురంలోని పోర్టు సాగరమాల కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటుచేసిన అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి కుమారుడు యశ్వంత్‌, కోడలు లీలాస్రవంతి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అక్కడ నుంచి 1.30 గంటలకు రుషికొండలో బాలాజీ మౌంట్‌ విల్లాకు ఎదురుగా గల విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళతారు. ఎంపీ కుమారుడు శరత్‌చౌదరి, కోడలు జ్ఞానిత దంపతులను ఆశీర్వదిస్తారు. అక్కడ నుంచి 1.45 గంటలకు అదే ప్రాంతంలో వున్న పార్వతీపురం మన్యం ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అత్తవారి ఇంటికి వెళతారు. నూతనంగా వివాహమైన విద్యాసాగర్‌నాయుడు, భవ్య దంపతులను సీఎం ఆశీర్వదించనున్నారు. అనంతరం 2.35 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 2.45 గంటలకు విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు.

Updated Date - 2023-01-25T00:35:51+05:30 IST