దళితుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు
ABN , First Publish Date - 2023-01-01T00:26:25+05:30 IST
ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూస్తోందని దళిత మహిళ శక్తి ఉత్తరాంధ్ర అధ్యక్షురాలు జి.మరియమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
కె.కోటపాడు, డిసెంబరు 31: ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూస్తోందని దళిత మహిళ శక్తి ఉత్తరాంధ్ర అధ్యక్షురాలు జి.మరియమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ దళితులను ఎంతో ఉద్దరిస్తున్నామని చెబుతున్నారని, ఎటువంటి మేలు చేయడం లేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దళితుల ఓట్లతో పెద్ద వారు అవుతున్నారు తప్ప ప్రయోజనం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దళితుల పట్ల సానుకూలంగా ఉండాలని జి. మరియమ్మ కోరారు. ఈమె వెంట నాయకులు ఉత్తరాంధ్ర కార్యదర్శి జి. యోగిరాజు, మారడపూడి గ్రేసమ్మ, అనకాపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు.