భారీ వర్షం
ABN , First Publish Date - 2023-10-01T01:12:38+05:30 IST
మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల సేపు ఏకధాటిగా వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రంగా కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ వర్షం వరి చేనుకు మరింత అనుకూలమని రైతులు చెబుతున్నారు.
- మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తరువాత వాన
కె.కోటపాడు, సెప్టెంబరు 30: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల సేపు ఏకధాటిగా వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రంగా కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ వర్షం వరి చేనుకు మరింత అనుకూలమని రైతులు చెబుతున్నారు.
మాడుగులలో..
మాడుగుల రూరల్: మండంలోని పలు గ్రామాల్లో శనివారం వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఆ తరువాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది.
రాంబిల్లిలో..
రాంబిల్లి : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై గాలులుతో కూడిన వర్షం కురిసింది.
రావికమతంలో..
రావికమతం: మండలంలో శనివారం కూడా వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురవగా, శనివారం కూడా కొనసాగింది.