నర్సీపట్నంలో ఇరిగేషన్‌ డీఈ కార్యాలయం

ABN , First Publish Date - 2023-04-26T00:51:58+05:30 IST

జలవనరుల శాఖ కొత్త డీఈ కార్యాలయాన్ని నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తూ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో వున్న ఈ కార్యాలయాన్ని త్వరలో నర్సీపట్నం తరలిస్తారు. అదే విధంగా ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌, వాటర్‌ షెడ్‌ మేనేజమెంట్‌ కార్యాలయాలను కూడా పునర్విభజన చేశారు.

నర్సీపట్నంలో ఇరిగేషన్‌ డీఈ కార్యాలయం
నర్సీపట్నం టౌన్‌ వ్యూ

విశాఖ డివిజన్‌ నుంచి తరలింపు

ఎలమంచిలి, తాండవ, నర్సీపట్నంతోపాటు కొత్తగా పాయకరావుపేట సబ్‌డివిజన్‌

చోడవరంలో యథావిధిగా డబ్ల్యూఎస్‌ఎం డీఈ ఆఫీస్‌

దీనిపరిధిలో రైవాడ, మాడుగుల, చోడవరం సబ్‌డివిజన్‌ ఆఫీస్‌లు

చీఫ్‌ ఇంజనీర్‌ ఉత్తర్వులు జారీ

నర్సీపట్నం, ఏప్రిల్‌ 25: జిల్లాల పునర్విభజన జరిగి ఏడాది అవుతున్నప్పటికీ అనకాపల్లి జిల్లాకు సంబంధించిన జలవనరుల శాఖ డివిజన్‌ కార్యాలయం విశాఖలోనే కొనసాగుతున్నది. దీని పరిధిలో నర్సీపట్నం, ఎలమంచిలి, విశాఖపట్నం, చోడవరంతోపాటు తాండవ రిజర్వాయర్‌ ప్రాజెక్టు (టీఆర్‌పీ), రైవాడ రిజర్వాయర్‌ ప్రాజెక్టు (ఆర్‌ఆర్‌పీ) సబ్‌డివిజన్‌ కార్యాలయాలు వున్నాయి. టీఆర్‌పీ ఆఫీస్‌ నర్సీపట్నంలో, ఆర్‌ఆర్‌పీ ఆఫీస్‌ దేవరాపల్లిలో వున్నాయి. విశాఖ డివిజన్‌ను విభజించి కొత్తగా నర్సీపట్నంలో డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తారు. దీని పరిధిలో నర్సీపట్నం, ఎలమంచిలి, టీఆర్‌పీ సబ్‌ డివిజన్లతోపాటు పాయకరావుపేటలో కొత్తగా ఏర్పాటుచేసే సబ్‌ డివిజన్‌ వుంటాయి. నర్సీపట్నంలో ఇరిగేషన్‌ డీఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన భవనాలను పరిశీలించడానికి ఉన్నతాధికారులు త్వరలో ఇక్కడికి రానున్నట్టు అధికారులు చెప్పారు.

కాగా ప్రస్తుతం చోడవరంలో వున్న వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ (డబ్ల్యూఎస్‌ఎం) డివిజన్‌ కార్యాలయాన్ని అక్కడే కొనసాగిస్తారు. ఇప్పటి వరకు నర్సీపట్నంలో వున్న డబ్ల్యూఎస్‌ఎం సబ్‌డివిజన్‌ కార్యాలయాన్ని మాడు గులకు తరలిస్తారు. దేవరాపల్లిలోని రైవాడ రిజర్వాయర్‌ ప్రాజెక్టు కార్యాలయం, చోడవరంలోని ఇరిగేషన్‌ సబ్‌డివి జన్‌ కార్యాలయం, ఇక్కడే వున్న డబ్ల్యూఎస్‌ఎం సబ్‌డివి జన్‌ కార్యాలయం ఇక నుంచి చోడవరంలోని డబ్ల్యూ ఎస్‌ఎం డివిజన్‌ కార్యాలయం పరిధిలో వుంటాయి.

Updated Date - 2023-04-26T00:51:58+05:30 IST