కన్నబాబూ.. నాపై గెలిచి చూపించు

ABN , First Publish Date - 2023-07-11T01:08:02+05:30 IST

నాపై గెలిచి చూపించాలని ఎమ్మెల్యే కన్నబాబుకు జనసేన ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్‌ సవాల్‌ విసిరారు.

కన్నబాబూ.. నాపై గెలిచి చూపించు
సమావేశంలో మాట్లాడుతున్న సుందరపు విజయకుమార్‌

మునగపాక, జూలై 10: నాపై గెలిచి చూపించాలని ఎమ్మెల్యే కన్నబాబుకు జనసేన ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్‌ సవాల్‌ విసిరారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాపై 50వేల ఓట్ల మెజారిటీ సాధిస్తానన్న కన్నబాబు మాటలు చూస్తుంటే.. అపుడే ఓటమి భయం కనిపిస్తుందన్నారు. జగన్‌ నిర్వహించిన సర్వేలో 40కి మించి వైసీపీకి సీట్లు రావని తెలియడంతో వై నాట్‌ 175 అంటూ లేనిపోని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో కన్నబాబు సాగిస్తున్న అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి కన్నబాబుకు డిపాజిట్‌ గల్లంతేనని అన్నారు. ఐ ప్యాక్‌ సర్వేలో కూడా ఎలమంచిలి నియోజకవర్గం గల్లంతు అవుతుందన్న విషయం అందరికీ తెలిసిపోయిందన్నారు. మంత్రి అమర్‌, బొడ్డేడ ప్రసాద్‌, కన్నబాబులు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప నిజానికి వీరికి ప్రజా సంక్షేమం, సమస్యల పట్ల శ్రద్ధ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు టెక్కలి పరశురామ్‌, ఉపాధ్యక్షుడు పాలిపిని రాము, సరోజినీ, వెంకటేశ్వరరావు, అగ్గాడ భాస్కరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-11T01:08:02+05:30 IST