పూడిమడక తీరంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-04T01:16:03+05:30 IST

మాఘపౌర్ణమిని పురస్కరించుకుని పూడిమడకలో ఉత్తరాంధ్ర ఆహ్వాన కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌, డీఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు.

పూడిమడక తీరంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

3ఏసీపీ7 : క్రీడాకారులతో ఆర్‌పీ పట్నాయక్‌, డీఎస్పీ శ్రీనివాసరావు

పోటీలను ప్రారంభించిన ఆర్‌పీ పట్నాయక్‌, డీఎస్పీ శ్రీనివాసరావు

అచ్యుతాపురం, ఫిబ్రవరి 3 : మాఘపౌర్ణమిని పురస్కరించుకుని పూడిమడకలో ఉత్తరాంధ్ర ఆహ్వాన కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌, డీఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ముందుగా వీరు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పదిహేను జట్లు ఈ పోటీల్లో తలపడుతున్నాయి. ఇందుకోసం సముద్ర తీరంలోని ఇసుక తిన్నెలపై కబడ్డీ కోర్టును, ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ, చతుర్థ స్థానాల్లో నిలిచే జట్లుకు రూ.10వేలు చొప్పున నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మిడి జగన్‌, గనగళ్ల దేముడు, చెల్లూరి బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T01:16:05+05:30 IST