Kodi Katti Case: కోడి కత్తి కేసుపై శ్రీనివాస్ తరుపు న్యాయవాది ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-09-06T14:44:59+05:30 IST
విశాఖపట్నం: కోడి కత్తి కేసుకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్ తరుపు న్యాయవాది అబ్దుల్ సలీం కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పితే వేరొకరు ఎవరు ఐ విట్నెస్‌గా లేరని అన్నారు.
విశాఖపట్నం: కోడి కత్తి కేసు (Kodi Katti Case)కు సంబంధించి నిందితుడు శ్రీనివాస్ (Srinivas) తరుపు న్యాయవాది అబ్దుల్ సలీం (Advocate Abdul Saleem) కామెంట్స్ (Comments) చేశారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)పై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు (YCP Leaders) తప్పితే వేరొకరు ఎవరు ఐ విట్నెస్‌గా లేరని అన్నారు. దినేష్ కుమార్, ఉమెన్ కానిస్టేబుల్, సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్లు చూడలేదని చెప్పారన్నారు. ఆరోజు కత్తి మజ్జి శీను వద్ద మాత్రమే ఉందని... ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని ముందు కత్తిని కూడా సమర్పించలేదన్నారు. ఈ కేసులో కర్త.. క్రియ.. కర్మ అన్ని మజ్జి శ్రీనివాసేనని అన్నారు. ఆ సమయంలో మజ్జి శ్రీను తన ఫోన్‌ను పోలీసులు అడిగితే ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉద్దేశపూర్వకంగానే జనపల్లి శ్రీనివాస్‌పై కేసు పెట్టారన్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు బయట పెడతానని అబ్దుల్ సలీమ్ స్పష్టం చేశారు.