దువ్వాడ రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్ ప్రారంభం
ABN , First Publish Date - 2023-05-26T00:35:11+05:30 IST
దువ్వాడ రైల్వే స్టేషన్ 4వ నంబర్ ప్లాట్‌ఫారంలో నూతన లిఫ్ట్‌ను గురువారం డీఆర్‌ఎం అనూప్ కుమార్ శెత్పథి ప్రారంభించారు.
కూర్మన్నపాలెం, మే 25: దువ్వాడ రైల్వే స్టేషన్ 4వ నంబర్ ప్లాట్‌ఫారంలో నూతన లిఫ్ట్‌ను గురువారం డీఆర్‌ఎం అనూప్ కుమార్ శెత్పథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ లిఫ్ట్ ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఈ స్టేషన్‌ను అమృత్ స్టేషన్‌గా రూపుదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజినల్ ఎలక్ర్టికల్ ఇంజనీర్లు సీహెచ్ కామేశ్వరరావు, శివానంద ప్రసాద్, సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి, ఇతర అధికారులు పాల్గొన్నారు.