నేత్రపర్వంగా వడ్డాది వెంకన్న కల్యాణం

ABN , First Publish Date - 2023-03-05T01:07:45+05:30 IST

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వడ్డాది గిరిజాంబగిరిపై ఉన్న వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి అత్యంత వైభవోపేతంగా జరిగింది.

నేత్రపర్వంగా వడ్డాది వెంకన్న కల్యాణం
స్వామివారి కల్యాణాన్ని జరిపిస్తున్న అర్చకులు

బుచ్చెయ్యపేట, మార్చి 4 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వడ్డాది గిరిజాంబగిరిపై ఉన్న వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను జరిపించారు. విశేష అలంకరణలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడ్ని కన్నులారా వీక్షించి భక్తులు తరించారు. ఇదిలావుంటే, శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్య కలగకుండా ఈవో శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్‌ఐ కుమార్‌స్వామి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గిరిజాంబగిరి విద్యుద్దీపకాంతులతో ధగధగలాడింది. వడ్డాదిలోని వీధులన్నీ సందడిగా మారాయి.

Updated Date - 2023-03-05T01:07:45+05:30 IST