వైసీపీకి పెంకుల రాజు రాజీనామా

ABN , First Publish Date - 2023-10-07T00:16:54+05:30 IST

ఉపమాక దేవస్థానం మాజీ చైర్మన్‌, వైసీపీ నేత చిలువూరి రామ సూర్యనారాయణరాజు (పెంకులరాజు) శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

వైసీపీకి పెంకుల రాజు రాజీనామా
విలేకర్లతో మాట్లాడుతున్న పెంకులరాజు

నక్కపల్లి, అక్టోబరు 6: ఉపమాక దేవస్థానం మాజీ చైర్మన్‌, వైసీపీ నేత చిలువూరి రామ సూర్యనారాయణరాజు (పెంకులరాజు) శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌కు పంపినట్టు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం నక్కపల్లిలో ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. వైసీపీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలోనే వున్నానని చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడా స్థానికంగా పార్టీ విజయానికి కృషి చేశానని, కానీ నాలుగున్నరేళ్లుగా తనకు పార్టీలో కనీస గుర్తింపు కూడా లేదని ఆవేదన వెలిబుచ్చారు. అందుచేతనే వైసీపీని వీడుతున్నానని, త్వరలో తన అనుచరులతో చర్చించి రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకుంటానని పెంకులరాజు చెప్పారు.

Updated Date - 2023-10-07T00:16:54+05:30 IST