వైసీపీ అరాచక పాలనతో ప్రజలకు కష్టాలు

ABN , First Publish Date - 2023-05-01T01:19:36+05:30 IST

వైసీపీ అరాచక పాలన వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ ఆరోపించారు.

వైసీపీ అరాచక పాలనతో ప్రజలకు కష్టాలు
పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడు పీవీజీ కుమార్‌

కె.కోటపాడు, ఏప్రిల్‌ 30 : వైసీపీ అరాచక పాలన వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ ఆరోపించారు. దాలివలస ఆదివారం రాత్రి జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జగన్‌ అసమర్థ పాలన వల్ల నిత్యావసర వస్తువులతో పాటు అన్నింటి ధరలు ఆకాశాన్ని అం టుతున్నాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమ లులో జగన్‌ విఫలమయ్యారని ఆరోపించారు. అవినీతికి అడ్రస్‌గా వైసీపీ పాలన ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ సీనియర్‌ నాయకులు పైలా ప్రసాదరావు, మండల శాఖ అధ్యక్షుడు రొంగలి మహేష్‌, నాయకులు జూరెడ్డి రాము, కన్నూరు సూర్యనారాయణ, బండారు నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-01T01:19:36+05:30 IST