‘ప్రజా స్పందన’ సీఎస్‌ రావు ఇక లేరు

ABN , First Publish Date - 2023-03-16T01:01:10+05:30 IST

ప్రజాస్పందన వ్యవస్థాపకుడు, సామాజిక ఉద్యమకారుడు రిటైర్డ్‌ ఐఈఎస్‌ అధికారి చాగంటి సుందరరావు(93) మృతిచెందారు. ఆరేళ్లుగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన మధురానగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 4.20కు కన్నుమూ సినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎస్‌రావు భార్య లక్ష్మి 1999లోనే తనువు చాలించారు. వీరికి ముగ్గురు కుమారులు.

‘ప్రజా స్పందన’ సీఎస్‌ రావు ఇక లేరు
సీఎస్‌ రావు (ఫైల్‌ ఫొటో)

అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత

సామాజిక సమస్యలపై అలుపెరగని పోరాటం

నగర వాసుల వాణిని వినిపించేందుకు ప్రజా స్పందన ఏర్పాటు

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్పందన వ్యవస్థాపకుడు, సామాజిక ఉద్యమకారుడు రిటైర్డ్‌ ఐఈఎస్‌ అధికారి చాగంటి సుందరరావు(93) మృతిచెందారు. ఆరేళ్లుగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన మధురానగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 4.20కు కన్నుమూ సినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎస్‌రావు భార్య లక్ష్మి 1999లోనే తనువు చాలించారు. వీరికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు చాగంటి దక్షిణ మూర్తి, రెండో కుమారుడు సీవీ జోగారావు ఉద్యోగ విరమణ పొందారు. మూడో కుమారుడు సి.విశ్వనాథరావు హైదరాబాద్‌లోని మౌరీ టెక్‌ సంస్థలో పనిచేస్తు న్నారు. ఇండియన్‌ ఎకానమిక్‌ సర్వీసెస్‌(ఐఈఎస్‌)లో పదవీ విరమణ తరువాత 33 ఏళ్ల కిందట సీఎస్‌రావు విశాఖ నగరానికి వచ్చారు. ఇక్కడి ప్రజా సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసేందుకు ప్రజాస్పందన పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. నగరంలోని కేంద్ర కారాగారాన్ని అప్పట్లో అడవివరం ప్రాంతానికి తరలించారు. ఆ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకించిన సీఎస్‌ రావు హైకోర్టులో పిల్‌ వేసి, ప్రజలతో కలిసి పోరాటం చేశారు. డీఆర్‌ఎం ఆఫీస్‌ వద్ద భారీ వృక్షాన్ని తొల గిం చే ప్రయత్నాలను అడ్డుకున్నారు. ప్రజాసమస్యలపై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అనేకసార్లు నిరసన తెలిపి విజయం సాధించారు.

ఐఈఎస్‌ మొదటి బ్యాచ్‌ ఉద్యోగి..

సీఎస్‌ రావు ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) మొదటి బ్యాచ్‌ ఉద్యోగి. ఏయూలో బీఏ ఆనర్స్‌ పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని స్మార్ట్‌ ఇండస్ర్టీ ఎక్స్‌టాన్సన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌గా, ఢిల్లీలోని ప్లానింగ్‌ కమిష న్‌లో, అప్పటి కేంద్ర మంత్రి వెంగళరావు వద్ద కొన్నాళ్లు పనిచేశారు. రిటైర్ట్‌ ఐఏ ఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ, డాక్టర్‌ రఘురామారావు, ప్రొఫెసర్‌ బాలమో హన్‌ దాస్‌ ఆయనకు సన్నిహితులు. వసంత మానస ఫౌండేషన్‌ ఆయనకు విశి ష్ట సేవా పురస్కారాన్ని అందించింది. ఆయన మృతి విశాఖ ప్రజలకు తీరని లోటని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బాలమోహన్‌దాస్‌ పేర్కొన్నారు. కాగా సీఎస్‌ రావు 2011లో సావిత్రీ బాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అవయవదానం చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బుధవారం ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్ర మెడికల్‌ కళాశాలలోని అనాటమీ విభాగానికి సీఎస్‌ రావు పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు.

Updated Date - 2023-03-16T01:01:10+05:30 IST