కనక మహాలక్ష్మి దేవస్థానం ఈఓగా మళ్లీ శిరీష
ABN , First Publish Date - 2023-04-26T01:23:06+05:30 IST
కనకమహాలక్ష్మి దేవస్థానం ఈఓగా జిల్లా దేవదాయ శాఖ అధికారిణి కె.శిరీషకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):
కనకమహాలక్ష్మి దేవస్థానం ఈఓగా జిల్లా దేవదాయ శాఖ అధికారిణి కె.శిరీషకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవలె (మార్చి 29న) ఈ దేవస్థానం ఈఓగా రమేశ్‌నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను వర్కింగ్ ఎరేంజ్‌మెంట్ కింద ఎన్‌టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఈఓగా నియమించారు. దాంతో ఇక్కడ , అక్కడ పనిచేయడం కుదరదు కాబట్టి శిరీషకు కనకమహాలక్ష్మి దేవస్థానం బాధ్యతలు అప్పగించారు. రమేశ్‌నాయుడు ఇక్కడే జీతం తీసుకుంటూ పెనుగంచిప్రోలులో పనిచేస్తారు. శిరీష జిల్లా దేవదాయ శాఖ అధికారిణిగా జీతం తీసుకుంటూ దేవస్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. గత జూలై నుంచి మార్చి 29 వరకు ఈమె అక్కడ ఈఓగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె ఆధ్వర్యంలోనే మార్గశిర మాసోత్సవాలు కూడా జరిగాయి.