కె.కోటపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో దొంగ ఓట్లు
ABN , First Publish Date - 2023-11-23T01:17:38+05:30 IST
ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని బీజేపీ మాడుగుల నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మేడపరెడ్డి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ రమేష్‌బాబుకు బుధవారం వినతిని అందజేశారు.
జనాలు ఉపాధి కోసం వలస వెళుతుంటే తగ్గాల్సిందిపోయి.. పెరగడం ఏమిటి?
బీఎల్‌వోలు, గ్రామ వలంటీర్ల అవకతవకల వల్లే ఈ దుస్థితి
జాబితాలో మృతి చెందినవారి పేర్లు.. : బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసరావు
కె.కోటపాడు, నవంబరు 22 : ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని బీజేపీ మాడుగుల నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మేడపరెడ్డి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ రమేష్‌బాబుకు బుధవారం వినతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో దొంగ ఓట్లు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటీవల మృతి చెంది నవారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉన్నా యని వివరించారు. నియోజకవర్గంలో 235 పోలింగ్ బూతులు ఉండగా, కె.కోటపాడు మండలంలో ఉన్న ప్రతి బూతులో 15 వరకు దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయమై గతంలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. గతంలో నియోజకవర్గంలో 1,71,000 ఓట్లు ఉండగా ఇప్పుడు 1,85,000 ఓట్లు ఉన్నా యని అధికారులు చెబుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పలువురు ఉపాధి నిమిత్తం వలస వెళుతుంటే ఓట్లు తగ్గాల్సిందిపోయి, పెరగడం ఏమిటని ప్రశ్నించారు. బీఎల్‌వోలు, గ్రామ వలంటీర్లు అవకతవకలకు పాల్పడడం వల్లే ఓట్ల సంఖ్య పెరిగాయిని ఆరో పించారు. ఈ సమావేశంలో పార్టీ కె.కోటపాడు మండల అధ్యక్షుడు కొటాన ఈశ్వరరావు, నాయకులు మేడపురెడ్డి శ్రీనివాస్, ఇమంది సన్యాసిరావు, కొమార అప్పారావు, దొగ్గా రమణ, సబ్బవరపు శివ, సిరికి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.