రైల్వే ఆసుపత్రిలో విజయవంతంగా ఆర్థో శస్త్రచికిత్సలు
ABN , First Publish Date - 2023-02-21T23:51:20+05:30 IST
వాల్తేరు డివిజన్ ప్రధాన ఆసుపత్రిలో తొలిసారిగా చేసిన కీలక ఆర్థోపెడిక్ ఆపరేషన్లు విజయవంతమయ్యాయి.
విశాఖపట్నం, ఫిబ్రవరి 21: వాల్తేరు డివిజన్ ప్రధాన ఆసుపత్రిలో తొలిసారిగా చేసిన కీలక ఆర్థోపెడిక్ ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. లోకో పైలట్‌గా పనిచేస్తున్న జి.రామన్న(55) గత ఏడాది డిసెంబరులో రోడ్డు ప్రమాదానికి గురై అబ్డోమినిస్ కండరాలు దెబ్బతినడంతోపాటు ఎడమ వైపు జాయింట్ డిస్‌లొకేట్ అయి రైల్వే ఆసుపత్రిలో చేరారు. పూర్తిగా మంచానికే పరిమితమైన ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తూ శస్త్రచికిత్సలు చేశారు. మంగళవారం ఆయన విజయవంతంగా డిశ్చార్జి అయ్యాడు. ట్రాక్ నిర్వహణ విధులు నిర్వహించే ఎం.సన్యాసిరావు(58) గత ఏడాది డిసెంబరులో ట్రాలీ నుంచి కిందకు పడి గాయాలకు గురై ఆసుపత్రిలో చేరారు. వెన్నెముక గాయాలతో మంచానికే పరిమితమైన ఆయనకు శస్త్ర చికిత్సలు చేశారు. ఆయన కూడా ఆరోగ్యవంతంగా మంగళవారం డిశ్చార్చి అయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్స్ చేసిన ఆర్ఠోపెడిక్ నిపుణులు డాక్టర్ టి.మహేంద్ర, డాక్టర్ ఏ.గోపీకృష్ణ, డాక్టర్ కె.సందీప్, ఎనస్తీషియా నిపుణులు డాక్టర్ ఎం.మహేష్‌కుమార్‌లతోపాటు చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కే వెంకటేశ్వరరావు, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్‌టీ జ్యోతిలను డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శెత్పతీ అభినందించారు.