22 నుంచి టీడీపీ బస్సుయాత్ర

ABN , First Publish Date - 2023-06-20T01:51:44+05:30 IST

గత నెలలో రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో ప్రకటించిన తొలి మేనిఫెస్టోను పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.

22 నుంచి టీడీపీ బస్సుయాత్ర

తొలి మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం

ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నియోజకవర్గాల్లో పర్యటన

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

గత నెలలో రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో ప్రకటించిన తొలి మేనిఫెస్టోను పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు నియోజకవర్గాల్లో పర్యటనకుగాను జోన్‌ల వారీగా బస్సులను కేటాయించింది. ఉత్తరాంధ్రకు కేటాయించిన బస్సును సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్రకు తాత్కాలికంగా షెడ్యూల్‌ ప్రకటించారు. ఈనెల 22వ తేదీన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో, 23న నర్సీపట్నం, 24న ఎలమంచిలి, 25న మాడుగుల, 26న చోడవరం నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర చేపట్టనున్నారు. గత నెలలో అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు సభలు జరిగినందున ప్రస్తుతానికి ఆ రెండింటినీ మినహాయించారు. ఇక ఈనెల 27వ తేదీన గాజువాక, 28న విశాఖ పశ్చిమ, 29న ఉత్తరం, 30న దక్షిణం, జూలై ఒకటో తేదీన తూర్పు, రెండో తేదీన భీమిలి, మూడున ఎస్‌.కోట నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని కార్యక్రమాన్ని రూపొందించినట్టు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 35 సీట్లు కలిగిన ఈ బస్సులో ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల నాయకులు ప్రయాణించాలని అధినేత చంద్రబాబునాయుడు సూచించారన్నారు. తొలి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారన్నారు. కాగా సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ నేతలు ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, ఎం.శ్రీభరత్‌, బుద్దా నాగజగదీశఽ్వరరావు, వంగలపూడి అనిత, ప్రగడ నాగేశ్వరరావు, పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, పీవీజీ కుమార్‌, గండి బాబ్జీ, కిడారి శ్రావణ్‌కుమార్‌, గిడ్డి ఈశ్వరి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, కోరాడ రాజబాబు, పీలా శ్రీనివాసరావు, కోళ్ల లతితకుమారి, పాశర్ల ప్రసాద్‌, పుచ్ఛా విజయకుమార్‌, రాజమండ్రి నారాయణ, కోట్ని బాలాజీ, బొండా జగన్‌, ఆరేటి మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-20T01:51:44+05:30 IST